Pothina Mahesh | విజయవాడలోని బుడమేరు వరద ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి వందల కోట్లు మిగిల్చిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ విమర్శించారు. బుడమేరు వరదల్లో విరాళాలు ఎంత వచ్చాయి.. ఎంత ఖర్చు చేశారో లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో సోమవారం పోతిన మహేశ్తో మాట్లాడుతూ.. చంద్రబాబు గారికి వందల కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరుకు వరద వచ్చిందని అన్నారు. చంద్రబాబుకు ఒక పక్క ఫోటో షూట్స్.. మరోపక్క విరాళాల వరద వచ్చిందని విమర్శించారు. బుడమేరు, చంద్రబాబు గారు ఇద్దరు మిలకత్ అయ్యారని అన్నారు. వరదలో వందల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని అన్నారు. పునరావాసం కోసం కోటి 40 లక్షలు ఖర్చు చేశారని.. 368 కోట్లు ఫుడ్ కోసం ఖర్చు చేశారని పేర్కొన్నారు. బాధితులకు నష్ట పరిహారం 200 కోట్లు ఇవ్వలేదు.. కానీ ఫుడ్ పేరుతో పందికొక్కుల్లా తిన్నారని మండిపడ్డారు
వరద బాధితులకు ఆహారం అమ్మవారు ఇచ్చారని.. ద్వారక తిరుమల, సింహాద్రి అప్పన్న నుంచి ఆహారం వచ్చిందని పోతిన మహేశ్ తెలిపారు. దేవుడు భోజనాలు పెడితే 368కోట్లు ఏ పందికొక్కులు తిన్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 26 కోట్లతో వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామని చెప్పారని.. 6 లక్షల మంది వరదలో ఉంటే కోటిన్నర ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు.
విజయవాడ ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిలితే కూటమి నాయకులకు, చంద్రబాబు గారికి కోట్ల రూపాయలు మిగిలాయి.. @ncbn
చంద్రబాబు గారికి వందల కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరు వొచ్చింది..
చంద్రబాబు గారికి ఒక పక్క ఫోటో షూట్స్.. మరోపక్క విరాళాల వరద..
బుడమేరు, చంద్రబాబు గారు ఇద్దరు మిలకత్… pic.twitter.com/8axwQmKy39
— Pothina venkata mahesh (@pvmaheshbza) October 7, 2024
జగన్ కోటి రూపాయలతో వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్స్ తీసుకొన్నారని తెలిపారు. 52కోట్లు శానిటేషన్ కోసం ఖర్చు చెప్పారని.. ఎక్కడ ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెల కోసం 23 కోట్లు ఖర్చు చేశారని.. డ్రోన్స్ కోసం 2కోట్లు ఖర్చు అయిందని పేర్కొన్నారని చెప్పారు. సరిగ్గా 10మందికి కూడా ఆహారం అందించలేదని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డ్రోన్స్ ద్వారా ఆహారం అందిస్తున్నట్లు ఫోటోలు వదిలారని.. దానికి 2కోట్లు పెట్టారని విమర్శించారు.
534 కోట్లకు టెండర్ వేశారని.. వచ్చిన విరాళాలకు ఖర్చులు చూపించారని పోతిన మహేశ్ అన్నారు. ఎవరికి కాంట్రాక్టు ఇచ్చారో.. ఎంతకు ఇచ్చారో లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నష్ట పరిహారం కోసం ప్రజలు రొడెక్కితే లాఠీ ఛార్జ్ చేశారని మండిపడ్డారు. పరిహారం కోసం కలెక్టరేట్ వద్ద బాధితులు క్యూ కడుతున్నారని తెలిపారు. కలెక్టరేట్ కి రోజు వేలాదిమంది వస్తున్నారని చెప్పారు. పేదల జీవితాలు చిన్నాభిన్నం అయితే చంద్రబాబు ఎందుకు స్వాదించారని ప్రశ్నించారు.
వైఎస్ జగన్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పోతిన మహేశ్ అభిప్రాయపడ్డారు. నష్టపోతే గంటల వ్యవధిలోనే బాధితుల అకౌంట్లలో డబ్బులు వేసేవారని గుర్తుచేశారు. వైఎస్ జగన్పై అక్కసుతో సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ల వ్యవస్థను నీరుగార్చారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వానికి, ఇప్పటి చంద్రబాబు సర్కార్కు ఉన్న వ్యత్యాసం గమనించాలని ప్రజలకు సూచించారు.