AP News | ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ తీవ్రంగా మండిపడింది. గత ప్రభుత్వం విద్యాశాఖలో రూ.6500 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయిందని.. అవన్నీ ఇప్పుడు తాము కడుతున్నామని లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిన మీకు ఆ వ్యవస్థను గురించి మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదని అన్నారు. నిక్కర్ మంత్రి అంటూ నారా లోకేశ్‌ను ఎద్దేవా చేసింది.
విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పిన మీ నాన్న శాడిస్ట్ చంద్రబాబు నాయుడిని అడుగు అలా ఎందుకు అన్నావని లోకేశ్‌ను వైసీపీ నిలదీసింది. మీ ప్రభుత్వ హయాంలో వందల కోట్ల బకాయిలు ఎందుకు పెట్టావని అడుగమని తెలిపింది. గతంలో బకాయిలు పెట్టి, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నావా లోకేశ్ అని మండిపడింది. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా నారా లోకేశ్‌ను పలు ప్రశ్నలు సంధించింది.
1. ప్రభుత్వ పాఠశాలలను కానీ, అందులో చదువుతున్న విద్యార్థులను కానీ మీరు ఏనాడైనా పట్టించుకున్నారా?
2 మీ ఇళ్లల్లో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకున్న మీరు.. గవర్నమెంటు స్కూలు పిల్లల విషయంలో ఎందుకు వివక్ష చూపారు?
3 పేదలు ఎప్పటికీ పేదలుగానే ఉండిపోవాలా? వాళ్లు ఎప్పటికీ కింది స్థాయిలోనే ఉండిపోవాలా?
4 మీ నాన్న ముఖ్యమంత్రిగా 14 ఏళ్లకాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసింది వాస్తవం కాదా?
5 నాడు-నేడు, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ, ఐబీవైపు అడుగులు, టోఫెల్, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్స్, 8వ తరగతి వచ్చే సరికే ట్యాబుల పంపిణీ, విద్యాకానుక, రోజుకో మెనూతో గోరుముద్ద… ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చింది నిజం కాదా?
6 మీ హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దుచేస్తూ వస్తున్నది నిజం కాదా?
7 మీ పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్కూళ్లు బాగుండాలి? గవర్నమెంటు స్కూళ్లు నిర్వీర్యం అయిపోవాలి? అనేదేగా మీ ఉద్దేశం?
8 గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు, మీ “ఈనాడు’’ కోర్టులకువెళ్లి అడ్డుకున్న తీరును ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు గుర్తు పెట్టుకోండి?
9 – ఇప్పటికైనా ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యంచేసే తప్పుడు పనులు మానుకోండి. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లండి. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలు ప్రపంచస్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయకండి. లేదంటే మీరు పేదప్రజల వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారు.