YCP | సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ బలపేతంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఇప్పటికే పలు విభాగాలు, జిల్లాల ఇన్ఛార్జిలను మార్చేసిన జగన్.. తాజాగా 10 మంది నాయకులకు పార్టీలో కీలక పదవులు ఇచ్చారు.
మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకు రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడిగా నియమించారు. డాక్టర్స్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా గోసుల శివభరత్ రెడ్డిని, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏ.రవిచంద్రను నియమించారు. ఈ మేరకు వైసీపీ అధిష్ఠానం అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
ఈ 10 మందికే కీలక పదవులు
– రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షులుగా సీదిరి అప్పలరాజు
– రాష్ట్ర డాక్టర్స్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా గోసుల శివభరత్ రెడ్డి
– రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎ.రవిచంద్ర
– రాష్ట్ర ఇంటెలక్చువల్ ఫోరం అధ్యక్షులుగా వై.ఈశ్వర ప్రసాద్
– రాష్ట్ర ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షులుగా ఏపీ ఎన్జీవోస్ అసోసియషన్ మాజీ అధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి
– పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పుత్తా శివశంకర్, చల్లా మధుసూదన్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి, కందుల రవీంద్రా రెడ్డి