Kuppam | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీ సభ్యులు టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సారథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉండవల్లికి వచ్చారు. అక్కడ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పచ్చ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నెలన్నర రోజులుగా చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తాము టీడీపీలో చేరుతున్నామని తెలిపారు. వైనాట్ 175 అన్నారు.. కుప్పంలో రౌడీయిజాన్ని పెంచి పోషించారని.. కుప్పంను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. అనంతరం కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గానికి చెందిన మరికొందరు వైసీపీ నాయకులు కూడా టీడీపీలో చేరబోతున్నారని తెలిపారు. కుప్పంలో తొందరలోనే వైసీపీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.