అమరావతి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి (YS Raja shekar Reddy) ఆశయాల కోసం పనిచేస్తానని ఏపీ కాంగ్రెస్ కమిటీకి నూతనంగా నియామకమైన వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. శనివారం ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్సార్ సమాధిని సందర్శించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పీసీపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకునేముందు వైఎస్ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇడుపులపాయకు వచ్చానని వెల్లడించారు.
సిద్ధాంతాలు నచ్చే కాంగ్రెస్(Congress) పార్టీలో చేరానని పేర్కొన్నారు. రాహుల్(Rahul Gandhi) ను ప్రధాని చేసే వరకు అందరం కలసి పనిచేస్తామని అన్నారు. అంతకుముందు హైదరాబాద్ శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన షర్మిలకు కడపలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపి రాంచంద్రరావు, తులసిరెడ్డి, రఘవీర్రెడ్డి స్వాగతం పలికారు. రేపు(ఆదివారం) ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు తీసుకోనున్నారు.