అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్(Visaka steel Plant) ప్రైవేటీకరణకు( privatization) నిరసనగా కార్మికులు, ఉద్యోగుల నిరసనలు హోరెత్తుతున్నాయి. అఖిలపక్షం నాయకులు, కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, నిర్వాసితులు శనివారం కూర్మన్నపాలెం నుంచి సింహాచలం వరకు పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర విధానాలకు, నరేంద్ర మోదీ(Narendra Modi)కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(Bjp government) రెండు నాల్కల ధోరణి అవలంభిస్తుందని కార్మికులు మండిపడ్డారు. పాదయాత్రలో సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. తానూ బిడ్ దాఖలు చేయనున్నట్లు లక్ష్మీనారాయణ ప్రకటించారు.