అమరావతి : ఆర్టీసీ బస్సు తన వాహనాన్ని ఢీకొట్టిందని ఆరోపిస్తూ విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్ సమీపంలో బస్సు డ్రైవర్‌పై ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించింది. 28 ఏళ్ల యువతి ఆర్టీసీ బస్సును ఆపి, డ్రైవర్ చొక్కా కాలర్ పట్టుకొని దాడి చేసింది. ఎదురుగా వస్తున్న తన వాహనాన్ని బస్సు ఢీ కొట్టిందని ఆమె ఆరోపించింది. ఆమె ప్రవర్తనతో దిగ్భ్రాంతి చెందిన కొందరు ప్రయాణికులు డ్రైవర్‌ను కొట్టకుండా ఆపే ప్రయత్నం చేశారు.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను సూర్యారావు పేట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. ఆర్టీసీ బస్సు విద్యాధరపురం డిపోకు చెందినది. డ్రైవర్‌పై దాడి చేసిన మహిళ కృష్ణలంక తారక రామ నగర్లో నివాసం ఉంటున్న కె .నందినిగా గుర్తించారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.