అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరింతా మెరుగ్గా పాలన అందిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM Jagan ) ప్రజలకు హామీ ఇచ్చారు. నిన్న జరిగిన పోలింగ్ పై ట్వీట్ ( Tweet ) చేశారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నాకు ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చినవారికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు సాగిన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు… pic.twitter.com/RQcsHZqWEO
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2024