అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నా డని భర్తను భార్య హత్య చేసి కట్టుకున్న వాడి బైకుపైనే నిందితులతో కలిసి పారిపోయింది. ఈ సంఘటన గుడుపల్లె మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హోసూర్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తమిళనాడులోని సూలగిరి పరిధి దేవసానపల్లెకు చెందిన రమేష్‌కి.. కుప్పం నియోజకవర్గం బోయనపల్లెకు చెందిన హాసినితో రెండేళ్ల కిందట వివాహం కాగా వీరికి ఏడాది వయసున్న మౌలికశ్రీ అనే కూతురు ఉంది.
సంగనపల్లెలోని మల్లప్పకొండ మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్దామని బయల్దేరారు. అయితే గుడికి వెళ్లిన కూతురు, అల్లుడు రాత్రయినా ఇంటికి రాకపోవడంతో హాసిని తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆలయ సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా మొదట భర్త, పాపతో హాసిని బైక్ పైన ఆలయానికి వెళ్లినట్లు కనిపించగా.. తిరుగు ప్రయాణంలో భర్త తెచ్చిన బైక్ పైనే మరో ఇద్దరు యువకులతో కలిసి తిరిగి వెళ్తున్నట్లు గుర్తించారు.
అయితే ఉద్దేశపూర్వకంగా పర్స్ పడేసి, కొంత దూరం వెళ్లాక తన పర్స్ పడిపోయిందని రమేష్‌కు చెప్పిన హాసిని పర్స్ కోసం రమేష్ వెళ్లగా.. అక్కడ ఆల్రెడీ కాపుకాస్తున్న ప్రియుడు యుగంధర్, అతని స్నేహితులు కలిసి రమేష్‌ను చంపి డెడ్ బాడీని అక్కడే వదిలేసి..రమేష్ బైక్‌పైనే రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. సాక్ష్యాల ఆధారంగా అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా మల్లప్పకొండ ఘాట్ రోడ్డు సమీపంలో రమేష్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.