వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరిస్తున్నామని ప్రకటించడంపై మండిపడ్డారు. ఎన్నికల్లో పాల్గొనకుండా, అసెంబ్లీకి రాకుండా జగన్కు రాజకీయ పార్టీ ఎందుకని విమర్శించారు.
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలా అక్రమాలు చేయాలో జగన్కు తెలిసినట్లు మరెవరికీ తెలియదని విమర్శించారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించారు. గౌతమ్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. ఎన్నికల్లో పాల్గొనకుండా, అసెంబ్లీకి రాకుండా జగన్కు రాజకీయ పార్టీ అవసరమా అని నిలదీశారు.
పులివెందులలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించలేని జగన్కు జీతమెందుకు అని భూమిరెడ్డి ప్రశ్నించారు. వెంటనే జగన్ రాజీనామా చేస్తే.. పులివెందులకు మరో ఎమ్మెల్యే వస్తారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోవడం సిగ్గుచేటు అని అన్నారు.