Perni Nani | తిరుమల డిక్లరేషన్ వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. శ్రీవారిపై నమ్మకంతోనే జగన్ అనేకసార్లు దర్శనం చేసుకున్నారని తెలిపారు. తిరుమలకు వచ్చే వారందరి నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు.
మోదీతో అన్యమతస్తుడు తిరుమలకు వెళ్తే బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. చంద్రబాబు ఏటా క్రిస్మస్ రోజు చర్చికి వెళ్తున్నారని అన్నారు. మసీదుకు వెళ్లి ప్రార్థన చేసే చంద్రబాబు నిఖార్సయిన హిందువా అని నిలదీశారు. జగన్ మతమేంటో తెలుగు ప్రజలందరికీ తెలుసని అన్నారు.
చంద్రబాబుకు ఈ వయసులో రాజకీయాలు ఎందుకు అని పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ను రాజకీయంగా అంతమొందించాలని కుట్ర పన్నారని విమర్శించారు. తెలిసి తెలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, అధికారులు తలో మాట చెబుతున్నారని అన్నారు. ఏ తప్పు జరగకపోయినా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు.
75 ఏళ్ల వయసులో ఈ అబద్ధపు బతుకు ఎందుకు చంద్రబాబు.. – మాజీ మంత్రి పేర్ని నాని @JaiTDP @ncbn @YSRCParty #PerniNani #TDP #YSRCP #RTV pic.twitter.com/5mQcuxJ0tr
— RTV (@RTVnewsnetwork) September 28, 2024