AP News | గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం నాశనమైందని.. `ఏపీ ఈజ్ బ్యాక్ టు బిజినెస్` అని మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ తప్పుబట్టింది. గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం నాశనమైందని.. `ఏపీ ఈజ్ బ్యాక్ టు బిజినెస్` అని మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ తప్పుబట్టింది. మీరు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఏం సాధించారని ప్రశ్నించింది. సూపర్ సిక్స్ హామీలకు ఎగనామం పెట్టారు.. ఆరోగ్యశ్రీ, ఆసరాకు మంగళం పాడారు.. తల్లికి వందనం నుంచి రైతుభరోసా, ఆడబిడ్డ నిధి, ఉద్యోగులు, నిరుద్యోగుల ఊసే లేదు.. ఇలా ఒక్కటేమిటీ అన్ని రంగాలను తిరోగమనం దిశగా తీసుకెళ్తూ ఏపీ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేస్తున్నది మీరు కాదా అని నారా లోకేశ్‌ను ప్రశ్నించింది. దమ్ము ధైర్యం ఉంటే సమాధానాలు చెప్పాలని పలు ప్రశ్నలను సంధించింది.
1- ఇన్నేళ్లలో మీరు ఎప్పుడూ చేయని విధంగా మాజీ సీఎం వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చేసి చూపించారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడమా లోకేశ్?
2- వైఎస్ జగన్ హయాంలో కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా, అర్హత ఒక్కటే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించారు. మీరు ఎప్పుడైనా ఇలా సంక్షేమ పథకాలు అందించారా లోకేశ్? పేదలకు సంక్షేమ పథకాలు అందించడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడమా లోకేశ్?
3- మీ నాన్న చంద్రబాబు నాయుడు ఇన్నేళ్లలో రాష్ట్రంలో ఎప్పుడూ చేయలేని అభివృద్ధిని జగన్ ఐదేళ్లలో చేసి చూపించారు. ఇలా చేయడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడమా లోకేశ్?
4- మీ నాన్న నియోజకవర్గమైన కుప్పం నుంచి.. ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామాన్ని అయినా తీసుకోండి. ఆ ఊరిని గతంతో పోల్చి చూడండి. గతంలో ఎప్పుడూ జరగని, కనిపించని అభివృద్ధి గత ఐదేళ్ల కాలంలో కనిపిస్తుంది. గ్రామాల రూపు రేఖలు మార్చడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడమా లోకేశ్?
5- ప్రతి ఊరిలో గ్రామ సచివాలయం, ఆర్బీకే కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లు, డిజిటల్ లైబ్రరీలు ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడైనా కనిపించాయా? అవన్నీ తీసుకువచ్చింది వైఎస్ జగన్ కాదా? ప్రజలకు పాలనను దగ్గర చేయడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడమా లోకేశ్?
గత 5 ఏళ్ళలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం నాశనమైంది. ‘ఏపి ఈజ్ బ్యాక్ టు బిజినెస్’ అని ఈ ప్రపంచానికి చెప్పటానికి, దావోస్ సదస్సు ఎంతో ఉపయోగపడింది.#AndhraIsBack#InvestInAP#APatWEF#WEF25#ChandrababuNaidu #NaraLokesh#AndhraPradesh pic.twitter.com/jcBOxYPojP
— Telugu Desam Party (@JaiTDP) January 23, 2025
6- రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ/ వార్డు సచివాలయాలు, అందులో 1,35,819 మంది శాశ్వత ఉద్యోగులను తీసుకువచ్చింది వైఎస్ జగన్ కాదా? మీ హయాంలో ఇలాంటి ఆలోచన అయినా చేశారా? మరి ఇంత మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడమా లోకేశ్?
7- దాదాపు రూ.18,000 కోట్లతో మనబడి నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చింది వైఎస్ జగన్ కాదా? మీ హయాంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలను అయినా బాగు చేశారా? ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడమా లోకేశ్?
8- జగన్ ఒక్క విద్యా రంగానికి చేసిన వ్యయమే రూ.73,417 కోట్లు.. మీరు ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఇంత ఖర్చు చేశారా? మన పిల్లలను గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకు కృషి చేయడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడమా లోకేశ్?
9- ఎక్కడ అవినీతికి చోటు లేకుండా రూ.2.62 లక్షల కోట్లకు పైగా పేదల ఖాతాల్లో నేరుగా జమ చేయడం గతంలో ఎప్పుడైన జరిగిందా? పేద ప్రజల బతుకులు మార్చడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడమా లోకేశ్?
10- రూ.8,480 కోట్లతో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మీ హయాంలో ఎప్పుడైనా జరిగాయా? రూ.16,855 కోట్లతో ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులు గతంలో ఎప్పుడైనా జరిగాయా లోకేశ్? ఇలా మెడికల్ కాలేజీలు కట్టడం, ఆస్పత్రులను బాగుచేయడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడమా లోకేశ్?
11- ఒక్క వైద్యరంగానికే వైయస్ జగన్ రూ.32,279 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మీ హయాంలో ఎప్పుడైనా చేశారా? పేద ప్రజలకు మంచి వైద్యం అందించడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడమా లోకేశ్?
12- రాష్ట్రంలో భారీ పరిశ్రమలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్ తీసుకువచ్చింది మరిచిపోయారా లోకేశ్? రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు నడిపించడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడమా లోకేశ్?
సరే.. మీరు అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల్లో ఏం సాధించారని వైసీపీ నిలదీసింది. సూపర్ సిక్స్ హామీలకు ఎగనామం పెట్టారని.. తల్లికి వందనం దగ్గరి నుంచి, రైతు భరోసా, ఆడబిడ్డ నిధి, ఉద్యోగులు, నిరుద్యోగుల ఊసే ఎత్తలేదని పేర్కొంది. ఆరోగ్యశ్రీకి, ఆసరాకు మంగళం పాడారని.. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను, పోర్టులను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగిస్తున్నారని విమర్శించింది. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించలేం అంటున్నారని.. ఆఖరికి పిల్లల చదువులపై కూడా కక్ష కట్టారని మండిపడింది. సీబీఎస్ఈకి, విదేశీ విద్యకు మంగళం పాడారని.. ఇప్పటికే ఐబీ, టోఫెల్‌ను అటకెక్కించారని చెప్పింది. విద్యార్థులు తక్కువగా ఉన్నారన్నసాకుతో ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పించారని.. ఇలా ఒకటేమిటి.. ఏ రంగాన్ని తీసుకున్నా అన్నింటినీ తిరోగమనం దిశగా తీసుకెళ్తూ ఏపీ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేస్తున్నది మీరు కాదా అని నారా లోకేశ్‌ను నిలదీసింది.?