Chandrababu | ఏపీలో జగన్ చేసినవి నవరత్నాలు కావవి.. నవ మోసాలు : చంద్రబాబు
Chandrababu | ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాల పేరిట నవ మోసాలకు పాల్పడ్డారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాల పేరిట నవ మోసాలకు పాల్పడ్డారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ( Chandrababu ) ఆరోపించారు. కృష్ణా జిల్లా పెడనలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం (Prajagalam) ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కూటమిని గౌరవించాలని సూచించారు.
సంపద సృష్టిస్తేనే రాష్ట్ర ఆదాయం పెరిగి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని అన్నారు. ఇసుక (Sand) క్వారీలు, అక్రమ మద్యం , భూములను దోచుకుని సంపదను పెంచుకున్న వైసీపీ నేతలకు ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. నీతి, నిజాయితీ, అభివృద్ధి,సంక్షేమమే కూటమి లక్ష్యమని పేర్కొన్నారు.
2014లో వైఎస్సార్ మరణం, 2019లో బాబాయి వైఎస్ వివేకా హత్య, నేడు పింఛన్‌దారుల శవాలతో సానుభూతి పొంది ఎన్నికల్లో లబ్ది పొందాలని సూచిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా వచ్చాయని, వైసీపీ ఓటమి ఖాయమని తెలిసిపోయిందని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

