అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం చోటు చేసుకున్నది. ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరు తీవ్ర గాయాలకు గురయ్యారు. తాడేపల్లి మండలం కడియుద్ధంలో ఈ ప్రమాదం జరిగింది. బాణాసంచా కర్మాగారం అన్నవరం అనే వ్యక్తి చెందిన గుర్తించారు.
ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పేలుడు సమయంలో సమయంలో ఫ్యాక్టరీలో పది మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. పేలుడుకు కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.