(Wedding Reception) న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మనవరాలు నీహారిక వివాహ ఆశీర్వచన కార్యక్రమం సోమవారం ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగింది. ఉపరాష్ట్రపతి దంపతులు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పార్లమెంటు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి కుమారుడు హర్షవర్ధన్ కుమార్తె అయిన నీహారిక-రవితేజ దంపతులకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందజేశారు.
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..