(Rains @ AP) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నందునే ఈ వర్షాలు కరుస్తాయని పేర్కొన్నది.
వాతావరణ శాఖ ప్రకారం, ఉత్తర కోస్తా ఆంధ్రలో ఇవాళ, రేపు ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నది. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. అదేవిధంగా దక్షిణ కోస్తా ఆంధ్రలో ఇవాళ, రేపు ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నది. ఆ తర్వాత రేపటి రోజుల్లో మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తా ఆంధ్రలోని చాలా చోట్ల మెరుపులు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. రాయలసీమలో బుధవారం ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురువొచ్చు.