అమరావతి : ఏపీలో లిక్కర్కేసుతో పాటు మరో 6 కేసుల్లో రిమాండ్‌లో ఉన్న వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ( Kakani Goverdanreddy ) బెయిల్‌పై బుధవారం విడుదల అయ్యారు. దాదాపు 83 రోజుల పాటు వివిధ కేసుల్లో ఉన్న ఆయనకు అన్ని కేసుల్లో బెయిల్ మంజూరుకావడంతో నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు( Central Jail ) నుంచి బయటకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై టీడీపీ, కూటమీ నాయకులు అక్రమంగా కేసులు పెట్టి జైలులో పెట్టారని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. సర్వేపల్లిలో టీడీపీ నాయకుడు సోమిరెడ్డి అవినీతికి అడ్డే లేకుండాపోయిం దని విమర్శించారు.
ఈ దోపిడీని పోరాటం ద్వారా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కేసులు కోర్టుల్లో ఉన్నందున తానేమి వాటిపై మాట్లాడడం భావ్యంకాదని అన్నారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి దుర్మర్గమని అన్నారు.