అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) విమర్శించారు. తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలన్ని ఒక నియంతలా బుల్డోజర్లతో కూల్చివేయించారని ఫైరయ్యారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని దుయ్యబట్టారు.
ఎన్నిలక తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు.. ఈ ఘటన ద్వారా ఈ ఐదేండ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారన్నారు. ఈ బెదిరింపులకు, కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదని, వెన్నుచూపేది అంతకన్నా లేదని స్పష్టం చేశారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజలతోడుగా గట్టి పోరాటాలు చేస్తామన్నారు. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని ఎక్స్ వేదికగా కోరారు.
‘ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన
@YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు @YSRCParty తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.
కాగా, తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున బుల్డోజర్లతో నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. కేవలం రెండు గంటల్లోనే పార్టీ ఆఫీసును బుల్డోజర్ల సాయంతో అధికారులు ధ్వంసం చేశారు. తెల్లవారకముందే సీఆర్డీఏ ఆదేశాలను మున్సిపల్ అధికారులు అమలు చేశారు. గేట్లు మూసేసి మరీ భారీ పోలీసుల మోహరింపు మధ్య కూల్చివేత జరిగింది. సీఆర్డీఏ ఆదేశాలపై కోర్టును ఆశ్రయించినా.. అవేమీ పట్టించుకోకుండా, నోటీసులివ్వకుండా నిర్మాణాన్ని కూల్చివేశారు. చంద్రబాబు నివాసం నుంచి టీడీపీ ఆఫీస్కు వెళ్లే మార్గంలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2024