అమరావతి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల లెక్కలు తేల్చి వారు తిన్నదంతా వసూలు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achchennaidu) పేర్కొన్నారు. మంత్రిగా బుధవారం బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో సహకార వ్యవస్థ (Cooperative system) ను సమగ్రంగా ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు. సహకార సంఘాలు, డీసీసీబీలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చుతామని అన్నారు. కొత్త సంస్కరణలు తెచ్చి సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.
రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనార్దన్‌రెడ్డి
సచివాలయంలో బుధవారం రోడ్లు భవనాలశాఖ మంత్రిగా జనార్దన్‌రెడ్డి(Janardhan reddy) బాధ్యతలు చేపట్టారు. ఛాంబర్లో ప్రత్యేక పూజలు అనంతరం ఆయనను అధికారులు,నాయకులు అభినందనలు తెలుపుతూ శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2014-19 వరకు టీడీపీ హయాంలో రాష్ట్రంలోని రోడ్లు, భవనాల అభివృద్ధికి రూ.14.900 కోట్లను (80 శాతం) ఖర్చు చేశామని వివరించారు.
ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం ఐదేండ్ల పాటు కేవలం 46 శాతం మాత్రమే కేటాయింపు నిధులను ఖర్చు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లపై గుంతలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. వైసీప ప్రభుత్వం కాంట్రాక్లర్లకు రూ.2,260 కోట్లను పెండింగ్‌లో పెట్టి్ందని విమర్శించారు.