అమరావతి : తిరుపతి లడ్డూ (Tirupati) వ్యవహారంలో కల్తీ (Adulteration) జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అవాస్తవాలతో అప్రతిష్టపాలు చేస్తున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. వైసీపీ హయాంలో లడ్డూ తయారిలో ఎలాంటి కల్తీ జరుగలేదని తామంతా వేంకటేశ్వర స్వామి వద్ద ప్రమాణం చేస్తాం. మీరు చేస్తారా? అంటూ చంద్రబాబు (Chandrababu) ను ప్రశ్నించారు. ఆదివారం తాడేపల్లిలో వైసీపీ నాయకులతో కలిసి అంబటి మీడియాతో మాట్లాడారు.
కూటమి హయాంలో జరిగిన తప్పును జగన్ మీద నెడుతున్నారని విమర్శించారు. అధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు దేవుడు మీద కూడా రాజకీయం చేస్తున్నారని, దేవుడు అతడిని క్షమించడం అన్నారు. అసత్య ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి ప్రాయశ్చిత్తం కోసం దీక్ష చేయాలని, ప్రజలను క్షమించమని అడగాలని డిమాండ్ చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియాలని విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంపై బీజేపీ నాయకుల దాడిని ఆయన ఖండించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దాడిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.