నంద్యాల : జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు ( Srisailam Project ) కు ఎగువభాగాన కురుస్తున్న వర్షాల వల్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు జలాశయం నుంచి 8 గేట్ల ద్వారా 2.17లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు ( Nagarjuna sagar ) విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 2.84 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 3.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883.10 అడుగుల వరకు నీరు నిలువు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలకు 205.2 టీఎంసీలు నిలువ ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడు అవకాశముందని వాతావరణశాఖ అధికారులు వివరించారు. తీరం వెంబడి 40-60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.