అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పండుగ పూట విషాదం ( Tragedy ) చోటు చేసుకుంది. ఆది దేవుడు వినాయకుడికి భక్తి శ్రద్ధతో పూజలు చేసుకోవడానికి అవసరమయ్యే పూలు, పత్రి, పండ్ల కోసం బాపట్ల ( Bapatla ) సమీపంలోని పూండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు ( Two boys) మార్కెట్కు వెళ్లారు. అక్కడి నుంచి చెరువుల్లో ఉండే కలువ పూల కోసం నాగభూషణం (17) , సుద్దపల్లి శ్రీమంత్( 15) అనే ఇద్దరు బాలురు చెరువుల్లో దిగారు. చెరువు లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక మునిగి చనిపోయారు.
స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో బంధువులతో కలిసి చెరువు వద్దకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో స్థానికుల సహాయంతో బాలుర మృతదేహాలను గాలించి బయటకు తీశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.