Srisailam | శ్రీశైలం, జూలై 23 : శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రెండు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 55,140 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
జలాశయానికి బుధవారం జూరాల విద్యుత్పోత్తి ద్వారా 39,746 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 36,975 వేల క్యూసెక్కుల నీరు విడుదలై సాయంత్రానికి 1,20,516 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరింది. అదే విధంగా జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 208.7210 టీఎంసీలు ఉన్నాయి. కుడి, ఎడమ జల విద్యుతోత్పత్తి కేంద్రాల ద్వారా 66,827 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.