Balakrishna : టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి వసుంధరతో కలిసి ఆయన ఓటు వేశారు. హిందూపురంలోని ఓ పోలింగ్ కేంద్రంలో వారు తమ ఓటును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రం బయట బాలకృష్ణ దంపతులు తమ వేళ్లకు ఉన్న సిరా గుర్తులను చూపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తు్న్నారు. నటుడు బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా ఆయన మరోసారి అక్కడి నుంచే బరిలో నిలిచారు.
#WATCH | Andhra Pradesh: Hindupur TDP MLA candidate and film star Balakrishna, along with his wife Vasundhara cast their votes at a polling station in Hindupur.#LokSabhaElections2024 pic.twitter.com/yQmeVlXvVB
— ANI (@ANI) May 13, 2024