అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం స్కూల్ స్టోర్ రూమ్లో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. స్కూల్కు సంక్రాంతి సెలవులు కావడంతో పెనుముప్పు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టంగానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
#WATCH | Fire broke out in the storeroom of Tekkali Government High School in Andhra Pradesh’s Srikakulam, today. The fire was contained by firefighters. No casualty was reported in the incident pic.twitter.com/dldhLzpW3t
— ANI (@ANI) January 17, 2024