అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) పర్యటన సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విజయవాడలోని ప్రత్యేక హెలికాప్టర్లో వెలగపూడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ వద్ద గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ , మంత్రులు ఘన స్వాగతం పలికారు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం 100 పనులను 77 వేల 249కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. ఈ ఒక్కరోజే 49 వేల 40కోట్ల రూపాయల పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుడుతున్నారు.