అమరావతి : వైఎస్ఆర్ జిల్లాలో(YSR Dist) దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. వీఆర్ఏ నరసింహ(VRA died) తన ఇంట్లో నిద్రిస్తుండగా బాబు అనే వ్యక్తి మంచం కింద డిటోనేటర్లు(Detonators exploded) పెట్టి పేల్చాడు. ఈ ఘటనలో నరసింహ అక్కడికక్కడే మృతిచెందాడు.
నరసింహ భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన సుబ్బలక్ష్మమ్మను హాస్పిటల్‌ను హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే నరసింహ మృతికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నిందితుడు బాబును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.