విజయనగరం జిల్లా శృంగవరపుకోట సబ్‌రిజిస్ట్రార్ శ్యామలపై వేటు పడింది. అవినీతి ఆరోపనల నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేశారు. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు.
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా విజయనగరంలో విస్తృత స్థాయి పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల ఎస్.కోటలోని రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి పలు దస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ శ్యామలను సస్పెండ్ చేశారు. దీంతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల్లో గుబులు మొదలైంది. ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.