Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైలం దేవస్థానంలో సుబ్రహ్మణ్యస్వామి వారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం, పష్ఠితిథుల్లో కుమారస్వామి విశేష అభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమాలను దేవస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అభిషేకానికి ముందుగా అర్చకులు దేశంలో శాంతిసౌభాగ్యాలు విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని సంకల్పం పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విగ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్యస్వామి వారికి పంచామృతాలతో పాటు పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అర్చన అనంతరం సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పారాయణం చేశారు.