అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్(Visaka Steel Plant) పరిరక్షణ కోసం ఉన్న అవకాశలన్నింటినీ పరిశీలిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu) అన్నారు. ఈ సమస్య తనకు అత్యంత జటిలమైన సమస్య అని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనాన్ని సెయిల్, కేంద్రం అంగీకరించాలని తెలిపారు. రా మెటీరియల్ కూడా లేదు అని అన్నారు. కేంద్రమంత్రి కుమారస్వామితో మాట్లాడనని తెలిపారు.
ప్లాంట్‌ను రివైజ్డ్ చేయాలని , ప్లాంట్‌ను శాశ్వతంగా కాపాడుకోవడానికి ఉన్న అవకాశాలను ఆలోచిస్తున్నామని తెలిపారు. ఆంధ్రాహక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఏర్పడ్డ ప్లాంట్ ప్రజల మనోభావాలతో కూడుకున్న వ్యవహారమని తెలిపారు. గిరిజన వర్సిటీని సాలూరులోనే కొనసాగిస్తామని, మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ సాధించడం పట్ల బీజేపీని అభినందించారు.
రాష్ట్రాన్ని 2047 వరకు స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తయారు చేసేందుకు డ్యాక్యూమెంట్ను రూపొందిస్తున్నామని ప్రధాని, మంత్రులకు వివరించానని తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌కు భూములివ్వక వైసీపీ ఐదేండ్లు గడిపిందని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ల్యాండ్ ఇవ్వడంతో డిసెంబర్లో శంకుస్థాపన జరుగనున్నట్లు తెలిపారు. విశాఖ నుంచి హౌరా వరకు నాలుగు లైన్లు అడిగామని తెలిపారు. నమో భారత్, వందేభారత్ రైళ్ల గురించి మాట్లాడినట్లు తెలిపారు. హైదరాబాద్-అమరావతి, అమరావతి-చెన్నై, హైదరాబాద్-చెన్నై కనెక్టివిటీ చేస్తూ బుల్లెట్ ట్రేన్ ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు.