అమరావతి : విశాఖపట్నంలో (Visakapatnam) పోలీసులు ఆంక్షలు విధించారు. రెండు రోజుల పాటు 35 మంది ఐపీఎస్ (IPS) అధికారుల పర్యవేక్షణ, 5వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. ప్రైవేట్ డ్రోన్ల ఫ్లైపై కూడా నిషేదం విధించారు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) రేపు (బుధవారం) రాక సందర్భంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లను చేపట్టింది.
ప్రధాని సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి, శంకుస్థాపనలు చేసేందుకు విశాఖకు రానున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. 1.5 కిలో మీట్ల రోడ్ షోలో ప్రధాని పాల్గొంటుండడంతో కట్టుదిట్టమైన భద్రత (Security) ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్‌కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్‌ను కూడా అధికారులు పూర్తి చేశారు. భారీ బహిరంగ సభకు శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి మూడు లక్షల మంది ప్రజలు హాజరయ్యేందుకు అవకాశముండడంతో అందుకు అనుగుణంగా రూట్, రోప్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, డామినేషన్ టీమ్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాట్టు చేసి ట్రైల్స్ రన్స్‌ను నిర్వహించారు.
గత వారం , పది రోజుల నుంచి ప్రధాని మోదీ పర్యటనపై అధికారులు సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు