Srisailam | కార్తీక మాసోత్సవాల నేపథ్యంలో ఆదివారం శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఏపీ టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా సెల్వమణి, ఏపీ దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు.
ఆదివారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి ఈవో పెద్దిరాజు పూలమాలు వేసి అర్చక వేదపండితులచే తిలకధారతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రం, ఙ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో మోహన్, శ్రీశైలం సిఐ దివాకర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.