తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాల ( Vaikuntha Dwara Darshanala ) సందర్భంగా ఈనెల 23న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా 23వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు ( VIP break darshans ) రద్దు చేయడంతో 22వ తేదీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు.
ఇందులో భాగంగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారని, ఈ కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేశామన్నారు.