Srisailam | ఉండవల్లి: శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం విజయవాడకు చెందిన సూర్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ మినీ బస్సును విరాళంగా అందజేసింది. రూ.23లక్షల విలువైన ఈ బస్సులో 25 సీట్ల సామర్థ్యం కలదు. ఈ బస్సును ఉండవల్లిలోని మంత్రి నారా లోకేశ్ నివాసంలో ఆయన చేతుల మీదుగా వాహన తాళాలను దేవస్థానం అధికారులకు అప్పగించారు.
ఈ కార్యక్రమంలో సూర్య కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావుతో పాటు 20 ళ్లసూత్రాల కమిటీ మాజీ చైర్మన్ వై.సాయిబాబు, శ్రీశైలం దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (A.E.O) కె.వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ ఆర్.మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.