Vijayasai Reddy | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మాజీ నేత విజయ సాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వనసీయత ఉన్నవాడినని.. కాబట్టే ఎవరికీ, ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగలేదని స్పష్టం చేశారు. భయం అన్నది నాలో ఏ అణువు అణువులోను లేదని.. కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులతో పాటు రాజకీయాలనే వదులుకున్నానని ట్వీట్ చేశారు.
ఏపీలో వైఎస్సార్పీ ఓటమి తర్వాత పలువురు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. నలుగురు ఎంపీలు సైతం రాజీనామా చేశారు. ఈ క్రమంలో జగన్ స్పందిస్తూ రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉండాలని.. ఫలానా వాళ్లు తమ నాయకులు అని కాలర్ ఎగరేసుకొని చెప్పేలా ఉండాలన్నరు. బయటకు వెళ్లే ప్రతీ రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలన్నారు. రాజకీయాల్లో కష్టనష్టాలు ఉంటాయని.. ఐదేళ్లు కష్టపడితే మళ్లీ మన టైమ్ వస్తుందన్నారు.
విశ్వసనీయత ముఖ్యమని చెప్పారు. రాజ్యసభ ఎంపీల్లో సాయిరెడ్డితో కలిపి నలుగురు వెళ్లిపోయారని.. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలన్నారు. మనంతట మనమే ప్రలాభాలకు లొంగి.. భయపడి రాజీనామాపడి పోతే మన వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయత ఏంటని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డికైనా, ముగ్గురు ఎంపీలకైనా ఇంకా ఒకరో ఇద్దరో పోతే వాళ్లకైనా అంతేనన్నారు. వైఎస్సారీపీ పార్టీ ఉందంటే.. అది ఎవరివల్లా కాదని.. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు మాత్రమేనన్నారు.