Vangalapudi Anitha | ఏపీ హోం మంత్రిగా (Home minister) వంగలపూడి అనిత (Vangalapudi Anitha) బుధవారం బాధ్యతలు తీసుకున్నారు (took charge). సచివాలయంలోని బ్లాక్-2లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు. హోం మంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. బాధ్యతల స్వీకరించిన అనితకు పార్టీ నేతలు, ఉన్నతాధికారులు కలసి అభినందనలు తెలిపారు.