అమరావతి : కేంద్ర మంత్రి, నటుడు సురేష్ గోపీ (Union Minister Suresh Gopi) విజయవాడలోని దుర్గమ్మను (Durgamma) శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు మంత్రి సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం ప్రారంభానికి వచ్చిన సందర్భంగా ఇంద్రకీలాద్రిని(Indrakeeladri) దర్శించుకున్నారు. కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తోందని అన్నారు . ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కళలకు ప్రాచుర్యం కల్పిస్తున్నామని, ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని సంగీత కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ఎంతో మంది అద్భుతమైన సంగీతకారులు తెలుగులోనే ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీని సరికొత్త ఏపీని తయారు చేస్తున్నారని ప్రశంసించారు. సంగీత టూరిజంకు గ్లోబల్ హబ్‌గా ఏపీని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. తన ఆదాయం, గ్లామర్ మూడోవంతుకు పైగా ఏపీ, తెలంగాణ నుంచి వచ్చినవేనని గుర్తు చేశారు.