అమరావతి : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) దంపతులు గురువారం తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అర్చకులు కేంద్రమంత్రికి ఘనస్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయక మండపంలో మంత్రికి తీర్థప్రసాదాలు, ఆశీర్వాదాలు అందజేసి సన్మానించారు.
అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు(Chandra Babu) రావడంతో ఇద్దరు పలకరించుకున్నారు. రాష్ట్ర మంతి లోకేష్, నారాయణ అభివాదం తెలిపారు. అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులు కేంద్రమంత్రితో కలిసి ఫోటోలు దిగారు.