హైదరాబాద్, జూలై18 (నమస్తేతెలంగాణ): కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్గడరీ గురువారం తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, అర్చకులు ఘనస్వాగతం పలికి గర్భగుడికి తీసుకెళ్లారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు.
తిరుమలలో స్వామివారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు పేరొన్నారు. బుధవారం స్వామివారిని 69,029 మంది దర్శించుకోగా 28,547 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా రూ. 2.90 కోట్ల ఆదాయం వచ్చింది.