తిరుమల : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ( Union Minister ) నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) గురువారం సాయంత్రం తిరుమలకు ( Tirumala ) చేరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో తిరుమలకు వచ్చిన మంత్రికి గాయత్రి రెస్ట్హౌజ్లో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. మంత్రిని కలిసిన వారిలో సీవీఎస్వో మురళికృష్ణ, డిప్యూటీ ఈవో భాస్కర్, ఓఎస్డీ తదితరులు ఉన్నారు.