అమరావతి : స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం (Srikakulam) జిల్లా గార మండలం కళింగపట్నం వంశధార నదిలో (Vamsadara River) స్నేహితులు స్నానానికి వెళ్లారు. వీరిలో కృష్ణచైతన్య(22) , దేవిప్రసాద్ (23) అనే ఇద్దరు యువకులు (Two youths ) ఈత రాక నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపుతో మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.