పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. బైక్పై వెళ్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ఇద్దరు యువకులు సజీవదహనమయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల పంచాయతీ బోనిగర్లపాడు గ్రామానికి చెందిన మేకల గణేశ్ (18), తలపల రమేశ్ (18) బైక్పై వెళ్తుండగా కంది పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లను తాకారు. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. వారు వెళ్తున్న బైక్ కూడా పూర్తిగా దగ్ధమైంది.