AP News | కృష్ణా జిల్లా కంకిపాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన కోడిపందేల శిబిరాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వణుకూరు-పునాదిపాడు యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో బీరు సీసాలతో కొట్టుకుని యువకులు వీరంగం సృష్టించారు. బీరు సీసాలతో కొట్టుకోవడంలో పలువురి యువకుల తలలు పగిలాయి. తీవ్రంగా గాయపడిన యువకులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కోడి పందేల శిబిరంలో ఘర్షణ జరుగుతుందన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అందర్నీ చెదరగొట్టారు. ఇంత ఘర్షణ జరిగినప్పటికీ మళ్లీ యథావిధిగా కోడి పందేలను నిర్వహిస్తుండటం గమనార్హం.