అమరావతి : ఉల్లాసంగా సంక్రాంతి పండుగను ( Sankranti festival ) జరుపుకునేందుకు వచ్చి పోటీ పడి మద్యం సేవించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ( Software Engineers ) దుర్మరణం పాలయ్యారు. అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలం బండవంటిపల్లెకు చెందిన ఆరుగురు యువకులు శనివారం మద్యం తాగేందుకు గ్రామశివారుకు వెళ్లారు.
వారి మధ్య మద్యం తాగే విషయంలో పోటీగా 19 బీర్లు తాగడంతో పుష్పరాజ్(27), మణి కుమార్(35) అనే ఇద్దరు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. అనంతరం వీరిని పీలేరులో ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మణికుమార్ మృతి చెందాడు. చికిత్స పొందుతూ పుష్పరాజ్ మృతి చెందాడు. పుష్పరాజ్‌కు ఇంకా వివాహం కాలేదని, మణికుమార్‌కు భార్య, కుమారుడు ఉన్నారని పోలీసులు తెలిపారు.