AP News | అనకాపల్లి జిల్లా విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి ముగ్గురు ముగ్గురు మహిళలు సముద్రంలో కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నూకరత్నం(27), కనకదుర్గ (24) అక్కాచెల్లెల్లు. వీరితో పాటు ఎలమంచిలి మండలం గొల్లలపాలేనికి చెందిన ద్వారంపూడి శిరీష (23).. తమకుటుంబానికి చెందిన మరో ఐదుగురితో కలిసి తంతడి బీచ్‌కు ఆదివారం మధ్యాహ్నం విహారయాత్రకు వెళ్లారు. సముద్రపు ఒడ్డున చాలాసేపు సరదాగా గడిపారు. ఇక వెళ్లేముందు ఒక సెల్ఫీ తీసుకుందామని సముద్రపు అంచునకు వెళ్లారు. అక్కడ ఉన్న కొండరాళ్లపై సెల్ఫీ తీసుకుంటుండగా.. అలల ఉధృతికి సముద్రంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.
అదే సమయంలో అక్కడ ఉన్న మత్య్సకారులు గమనించి వారిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ ముగ్గురిని వెంటనే కుటుంబసభ్యులు అనకాపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి వెళ్లేలోపే నూకరత్నం, కనకదుర్గ మరణించారు. శిరీష ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది.