అమరావతి : ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. విశాఖలోని నరవ ఎల్జీనగర్ వద్ద ఈ ఘటన జోటు చేసుకుంది. విశాఖ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన రాజేశ్(17), అఖిల్(17) అనే విద్యార్థులు (Polytechnic students) చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో వారికి ఈత రాక చెరువులో మునిగిపోయారు.
సహచరుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో విద్యార్థుల కోసం గాలింపు(Serching) చర్యలు చేపట్టారు. గాలింపులో ఇద్దరి మృతదేహాలు లభ్యం కావడంతో వాటిని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.