అమరావతి : ఏపీలోని కర్నూలు( Kurnool ) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ( Road accident ) ముగ్గురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి కడప జిల్లా మైదకూరుకు స్కార్పియో వాహనంలో బయలు దేరిన మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ కాశిరెడ్డినాయన ఆశ్రమంవద్ద ట్రాక్టర్ను ఢీ కొట్టింది .
ఘటనాస్థలిలో మున్ని(35), షేక్ కమల్ బాషా(50), మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మూడేళ్ల చిన్నారి షేక్ నదియా మృతి చెందింది. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు . పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.