అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(High Court) న్యాయమూర్తులుగా గురువారం ఇద్దరు ప్రమాణం చేశారు. హైకోర్టులోనే అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావు(Mallikharjuna Rao) , జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి ( Laxminarasimha Chakravarthi) తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు.
హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో (Court Hall) జరిగిన కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు, ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి, రిజిష్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మందికి గాను 30 మంది పనిచేస్తుండగా గురువారం మరో ఇద్దరి ప్రమాణం చేయడంతో వీరి సంఖ్య 32కు చేరుకుంది.