అమరావతి : హాస్టల్లో భోజనం సరిగా లేదని ప్రశ్నించడంతో వార్డెన్ (Warden) దుర్భాషలాడినందుకుగాను ఇద్దరు విద్యార్థినులు (Students) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సత్తెనపల్లి బాలిక హాస్టల్లో చదువుకుంటున్న సునీత, అఖిల అనే విద్యార్థినులు హాస్టల్ భోజనం (Food) సక్రమంగా ఉండడం లేదని వార్డెన్‌ను నిలదీశారు.
ఆగ్రహించిన వార్డెన్ విద్యార్థినులపై దుర్భాషలాడారు. దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరు జ్వరం మాత్రలు మింగారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను విద్యార్థినులు, వార్డెన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు . సమచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు హాస్టల్‌ను, ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విద్యార్థినులను పరామర్శించి వివరాలు సేకరించారు.