అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు (Students) దుర్మరణం చెందారు. జిల్లాలోని దివాన్ చెరువు జాతీయ రహదారి గుండా ద్విచక్రవాహనంపై వెళ్తుండగా దాని వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి ప్రవీణ్‌కుమార్(20), పల్నాడు జిల్లాకు చెందిన చింతా కార్తీక్(19) మరణించారు. గైట్ కళాశాలలో చదువుతున్న వీరి మరణంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.